అంబేద్కర్ విగ్రహానికి పలువురు ముఖ్యనేతల నివాళి
MHBD: బాబాసాహెబ్ అంబెద్కర్ జయంతి సందర్భంగా మానుకోట పట్టణంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్, MLC తక్కెళ్ళపల్లి రవీందర్, కలెక్టర్ స్నేహశబరీష్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమామురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.