ఇవాళ బాలయ్య 'NBK-111'పై అప్‌డేట్
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో ‘NBK-111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీ నుంచి ఈ రోజు సాలిడ్ అప్డేట్ రానుంది. మధ్యాహ్నం 12.01 గంటలకు ఈ సినిమా హీరోయిన్ ఎవరనేది ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. 'యుద్ధభూమి దాని రాణిని స్వాగతించడానికి సిద్ధంగా ఉంది' అంటూ క్యాప్షన్ జోడించారు. కాగా ఈ పాత్రలో నయనతార నటిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.