'కెఎన్ఎం-12368 రకం ధాన్యాన్ని పండించండి'

W.G: భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో కెఎన్ఎం-12368 అనే సన్నని వరినాట్లు వేసిన పొలాన్ని సోమవారం జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆ రకం యొక్క గుణగణాల్ని, మార్కెట్ విధానంపై పలు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారులతో రైస్ మిల్లర్లను అనుసంధానం చేసి ఈ రకం ఓపెన్ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ అమ్ముడు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.