ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
VZM: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొని వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.