దుర్ఘటనలో 71 మంది మృతి.. నేటికి 134 ఏళ్లు

KDP: ముద్దనూరులోని మంగపట్నంలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నేటికి 134 ఏళ్లు. బ్రిటిష్ కాలంలో వర్తకాలు సాగించేందుకు మద్రాసు నుంచి కొండాపురం మీదుగా ముంబైకి మెయిల్ ఎక్స్ ప్రెస్ ఏర్పాటు చేశారు. అయితే అది వానాకాలం, బురద ఉండడంతో రైలు బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. అది తెలియక రైలు నడపడంతో బోగీలన్నీ భూమిలోకి కూరకుపోయాయి. ఆ ఘటనలో 71 మంది మృత్యువాత పడ్డారు.