గిరిజన కూలీలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి.!
NGKL: తెలకపల్లి సమీపంలోని ఓ బొగ్గు బట్టీలో ఐదేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న 29 మందికి అధికారుల చొరవతో విముక్తి లభించింది. వీరు ప్రకాశం(D) కురిచేడు మండలానికి చెందిన 6 కుటుంబాలుగా గుర్తించారు. 'కోనేరు' స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో స్పందించిన RDO సురేశ్ ఆదేశాల మేరకు.. తహసీల్దార్ విజయ్ కుమార్, SI నరేష్, DLO రాజు కార్యాలయానికి తరలించారు.