రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలం పందలపాక, కొంకుదురు రైతు సేవా కేంద్రాలను బుధవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా టార్గెట్లు లేవని రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా వెనక్కి పంపుతున్న వైనాన్ని గుర్తించి ఉద్యోగులను నిలదీసారు. అధికారులకు పోన్ చేసి రైతు తీసుకువచ్చిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.