VIDEO: ఈదురుగాలులకు విద్యుత్ వైర్లపై కూలిన చెట్టు

VZM: వర్షం ప్రభావంతో బుధవారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో ఈదురుగాలులకు 11 కెవి విద్యుత్ లైన్‌పై చెట్టు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మల్లమ్మపేటకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు స్పందించి క్రెయిన్ సహాయంతో చెట్టును తొలగించారు.