‘గ్రామీణ రోడ్లకు భారీగా గ్రాంట్ మంజూరు’

‘గ్రామీణ రోడ్లకు భారీగా గ్రాంట్ మంజూరు’

VZM: చీపురుపల్లి నియోజకవర్గంలో గ్రామీణ రహదారి అభివృద్ధికి రూ.9.70 కోట్లు మంజూరైనట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు తెలిపారు. గట్టుపల్లి–నరసయ్యపేట, అనందపురం–పూతికపేట, గుర్ల అప్రోచ్–పెద్దమజ్జిపేట, గరివిడి జీజీ రోడ్డు–ఇప్పలవలస, కుమరాం–తాటిగూడ సహా పది రహదారి పనులకు ఈ గ్రాంట్ కేటాయించబడిందన్నారు.