రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
KMM: జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబంలో విషాదం నింపింది. వివరాలోకి వెళ్తే.. కొణిజర్ల (M)తనికెళ్లలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బొలెరో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. HYD నుంచి అశ్వారావుపేటకు టైల్స్ లోడుతో వెళ్తున్న వాహనంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారు ఏపీలోని ఏలూరు జిల్లా చెందినవారిగా గుర్తించారు.