అయ్యప్ప స్వాముల జ్యోతి పూజ.. అన్నదానం
CTR: వెదురుకుప్పం మండలం చవటగుంట గ్రామంలో బుధవారం అయ్యప్ప స్వాముల జ్యోతి పూజ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదములను వడ్డించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం అధ్యక్షులు బట్టే చాణిక్య ప్రతాప్, తెలుగు యువత నాయకులు భాష్యం సతీష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.