మంత్రి వంగలపూడిని కలిసిన ఎమ్మెల్యే కొలికపూడి

కృష్ణా: విజయవాడలో హోంమంత్రి వంగలపూడి అనితను తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందించి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో శాంతిభద్రతలపై కొద్దిసేపు చర్చించారు. నియోజకవర్గానికి పోలీసు సిబ్బంది ఏర్పాటు, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కొలికపూడి విన్నవించారు.