పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
SRD: సిర్గాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ MLA భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. శనివారం మండల కేంద్రంలో ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన CMRF, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఇందులో మాజీ MPP మహిపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు సంజీవరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.