పుంగనూరు దుకాణాల్లో ఆకస్మిక దాడులు
CTR: నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ముని వెంకటప్ప, నవరత్న హెచ్చరించారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలోని వివిధ దుకాణాలు, హోటల్స్‌లో సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. విక్రయిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.