ఏకకాలంలో భారీ తనిఖీలు

ఏకకాలంలో భారీ తనిఖీలు

HYD: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వేదికల గోదాములపై ఏకకాలంలో భారీ తనిఖీలు నిర్వహించారు. జెప్టో, జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జొమాటో, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు చెందిన 75 గోదాములను తనిఖీ చేశారు. ఈ డ్రైవ్‌లో 98 ఎన్ ఫోర్స్‌మెంట్ శాంపిల్స్‌తో పాటు మొత్తం 222 నమూనాలను సేకరించారు. కాలం చెల్లిన సరుకును ధ్వంసం చేశారు.