ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసిన భార్య
గుంటూరు జిల్లాలోని కృష్ణనగర్ పార్క్ వద్ద ఓ వివాహిత, తన ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భర్త నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనకు దూరంగా ఉంటూ, తనపై హత్యకు పాల్పడినట్లు భాదితుడు ఆరోపించాడు. సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.