VIDEO: పుట్టగుంట వద్ద బుడమేరు వరద.. ఎమ్మెల్యే అలర్ట్

కృష్ణా: సీఎం చంద్రబాబు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వల్ల బుడమేరులో వరద ప్రవాహం సజావుగా కొనసాగుతోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. పుట్టగుంట వంతెన వద్ద వరద పరిస్థితిని ఆయన గురువారం పరిశీలించారు. కోతకు గురైన ఎన్‌హెచ్ 216 రహదారి మరమ్మత్తులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు.