ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

ఎర్రచందనం స్మగ్లర్‌కు  ఐదేళ్ల జైలు శిక్ష

TPT: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో స్మగ్లర్ ఎస్. గుణశేఖర్‌ను ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకెళ్తే తమిళనాడుకు చెందిన నిందితుడు 2016లో చామల రేంజ్ పరిధిలో ఎర్రచందనం రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. దీంతో శిక్షపడిన అతన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.