'గాలిపటాలతో సరికొత్త ప్రచారం'
NRML: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గాలిపటాలు ఎగురవేసి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ ఐడీవోసీలో జరిగిన 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో ఆయన పాల్గొని వాహనదారులను అలర్ట్ చేశారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటిస్తూ, హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇళ్లకు చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు.