రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
ATP: పెద్దవడుగూరు మండలం గుత్తి-అనంతపురం గ్రామ సమీపంలోని 44 హైవేపై ఇవాళ కారును, కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సుధీర్, ప్రయాణికురాలు రజనీకి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. గుత్తి నుంచి అనంతపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.