క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎస్సై

క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎస్సై

GDWL: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎర్రవల్లి మండలం దువాసిపల్లిలో నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్సై తరుణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వానికి అవసరమని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, దివాకర్, చందు తదితరులు పాల్గొన్నారు.