చిట్యాలలో అగ్నిప్రమాదం.!
MDK: చిట్యాలలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన సింధు వైకుంఠం నివాస గుడిసె కాలిపోయి కుటుంబం వీధిన పడింది. కుటుంబం తక్షణ అవసరాల కోసం ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ శైలజ భర్త రాజు గౌడ్ ఆర్థిక సహాయం చేశారు. MLA రోహిత్ సహకారంతో ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేలా ప్రయత్నం చేస్తామన్నారు.