'ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యసాధనలో బ్యాంకర్ సహకరించాలి'

KNR : వివిధ ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్య సాధనలో ఆర్థిక పరమైన అంశాల్లో బ్యాంకర్‌లు సహకరించాలని, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్‌లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జి.పి.వై. రుణాలు, ఎస్సీ, బీసి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల సమావేశం నిర్వహించారు.