కేంద్రమంత్రి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం
SDPT: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్‌లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన ఖోఖో పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ జట్టు నియోజకవర్గ స్థాయిలో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా విద్యార్థులు అవార్డును అందుకున్నారు. విద్యార్థుల ప్రతిభను కేంద్ర మంత్రి అభినందించగా, కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.