గుంతలమయమైన అంతర్గత రోడ్లు

గుంతలమయమైన అంతర్గత రోడ్లు

SRD: మొగుడంపల్లి మండలం ధనశ్రీ, ఇప్పేపల్లి, మాడ్గి గ్రామాల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. ఈ దారుల్లో ప్రయాణించడం ప్రాణసంకటంగా మారిందని, అత్యవసర సమయాల్లో వాహనాలు రావడం కూడా కష్టమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.