పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
WGL: రాయపర్తి మండలం కొత్తూరు జడ్పీ హైస్కూల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మీయంగా జరిగింది. 1994-95 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు 31 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంలో తమకు విద్యాబుద్ధులు బోధించిన గురువులు గోపాలచారి, సారయ్యలను ఘనంగా సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.