'జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలి'

'జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలి'

SRD: కల్లు గీత కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ అన్నారు. సోమవారం సిర్గాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తి రక్షణ, కార్మికుల ఉపాధి, గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు భారీ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంజి గౌడ్, కృష్ణ గౌడ్  తదితరులు ఉన్నారు.