ఎల్లమ్మగూడెంలో ధాన్యం సేకరణ కేంద్రం ప్రారంభం
NLG: తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ఉట్కూరి వాణి సందీప్ రెడ్డి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. సెంటర్ నిర్వాహకులు రైతులకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.