లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా దేమే యాదగిరి

MDK: లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట అధ్యక్షుడిగా దేమే యాదగిరి మూడోసారి ఎన్నికయ్యారు. స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, కోశాధికారిగా జీపీ స్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లయన్స్ క్లబ్ ద్వారా నిరుపేదలకు సేవలందిస్తామని వారు తెలిపారు.