ఈనెల 25న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా..?
JGL: ఈనెల 25న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీ. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈనెల 27 నుంచి గ్రామాల బాట పట్టనున్నారని సమాచారం. గ్రామాల్లో తిరుగుతూ పార్టీ మార్పుపై ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. తనకు జరిగిన అన్యాయం, పార్టీ మార్పుపై ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.