మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ మృతి

MNCL: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్, దండేపల్లి మాజీ జడ్పీటీసీ డాక్టర్ ప్రవీణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దండేపల్లి మండలంలోని మేదరిపేటకు చెందిన ప్రవీణారెడ్డి గత టీడీపీ ప్రభుత్వం హాయంలో ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆమె 35 సంవత్సరాలుగా డాక్టర్ గా దండేపల్లి, జన్నారం, లక్షెట్టిపేట మండలాల ప్రజలకు వైద్య సేవలు అందించారు.