ధర్మవరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ధర్మవరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

సత్యసాయి: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు బుధవారం ధర్మవరం పట్టణంలో బాల బాలికలతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం ద్వారా దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు.