చైనా వాలీబాల్ పోటీలకు మణుగూరు విద్యార్థి

చైనా వాలీబాల్ పోటీలకు మణుగూరు విద్యార్థి

BDKమణుగూరు గ్రామ పంచాయతీ కూనవరం గ్రామానికి చెందిన ఏనిక సంతోష్ చైనాలో జరగనున్న అండర్-19 వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. సంతోష్ ఎంపికపై గ్రామస్తులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, క్రీడల్లో ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. అలాగే పలువురు నాయకులు అభినందించారు.