రాయచోటిలో ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి పల్లకి సేవ

రాయచోటిలో ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి పల్లకి సేవ

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారని ఆలయ ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఈవో డీవీ. రమణారెడ్డి తెలిపారు.