'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 200 అర్జీలు'
కోనసీమ: అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమానికి 200 అర్జీలు వచ్చాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.