'ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు అన్యాయం'

ADB: ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల్లో గిరిజన నిరుద్యోగులకు ITDA అధికారులు అన్యాయం చేస్తున్నారని ఏజెన్సీ సాధన కమిటీ అధ్యక్షుడు జాదవ్ సోమేశ్ ఆరోపించారు. బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా సీఆర్టీ నియామకాల్లో అవకతవకలు జరిగాయన్నారు. గిరిజన నిరుద్యోగులను ఆదుకోవాలని పేర్కొన్నారు.