రోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్‌ల నిర్లక్ష్యం
MDCL: నగరంలో కొందరు ఆర్టీసీ డ్రైవర్‌లు రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. బస్ స్టాప్ వద్దకు రాగానే డ్రైవర్‌లు బస్సును స్టాప్ సమీపంలో కాకుండా రోడ్డుపై బ్రేక్ వేస్తున్నారు. దీంతో వెనక వచ్చిన వాహనలు ప్రమాదానికి గురవుతున్నాయి. బస్సులను నడి రోడ్డు పై ఆపడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని వాహణదారులు వాపోతున్నారు. బస్సులను బస్ స్టాప్‌లోనే నిలపాలని డిమాండ్ చేస్తున్నారు.