కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ప్రణవ్

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ప్రణవ్

HNK: కమలాపూర్ మండలం భీంపెల్లిలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వాసాల శ్రీనివాస్, వార్డు సభ్యులకు మద్దతుగా హుజురాబాద్ ఇంఛార్జి వొడితల ప్రణవ్ మంగళవారం ప్రచారంలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, మంగళ హారతులతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, అధికార పార్టీకే మద్దతు తెలుపుతున్నామని ప్రజలు బ్రహ్మరథం పట్టారు.