సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి
PDPL: సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని గుర్తింపు సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గోదావరిఖని భాస్కర్ రావు భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం నిర్వహించే స్ట్రక్చర్ సమావేశాలలో ఒక్కొక్కటిగా సమస్యలు అంగీకరిస్తుందన్నారు. సొంత ఇంటి పథకం అమలు కోసం యాజమాన్యం కసరత్తు చేస్తుందన్నారు.