బస్సు ప్రమాద దుర్ఘటన బాధాకరం: ఎమ్మెల్యే

బస్సు ప్రమాద దుర్ఘటన బాధాకరం: ఎమ్మెల్యే

NLR: హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన వారు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం ఆ గ్రామానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.