'అతిసార వ్యాధి పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

'అతిసార వ్యాధి పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

KNL:  అతిసార వ్యాధి పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పెద్ద కడుబూరు గ్రామ సర్పంచ్ రామాంజనేయులు ఆదేశించారు. సోమవారం సచివాలయం-1 నందు జరిగిన గ్రామసభలో సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అతిసార వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.