గుణదలలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని వినతి
NTR: గుణదల, రామవరప్పాడులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాసుపత్రి, దంత వైద్యశాలకు ఎంతో దూరం నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఆటోనగర్‌కు దగ్గరగా ఉండే ప్రాంతం కావడంతో కార్మికులు పేదలు అధికంగా ఉంటారు. కావున అధికారులు గుణదల ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.