ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు

ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు

PPM: ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నదికి వరద పోటెత్తింది. దీంతో జియ్యమ్మవలస మండలం బాసంగి ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో శ్రీనివాసరావు పాఠశాలను పరిశీలించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద తగ్గేవరకు విద్యార్థులు పాఠశాల భవనంకు రాకూడదని, ఉపాద్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.