మరో రెండు సీట్లు గెలిచి ఉంటే ఇంకో మంత్రి పదవి వచ్చేది: సీఎం

NGKL: జిల్లాలో 14కు 12 అసెంబ్లీ స్థానాలు గెలిచామని మరో రెండు స్థానాలు గెలిచి ఉంటే ఇంకో మంత్రి పదవి వచ్చి ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెంట్లవెల్లి సభలో సీఎం మాట్లాడారు. 12 స్థానాలు గెలవడంతో రెండు మంత్రి పదవులు, సీఎం పదవి మన జిల్లాకే ఉందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.