రేపటి నుంచి అచ్చమ్మ తల్లి జాతర
BDK: సుజాతనగర్ మండలం చిమ్నా తండా గ్రామంలో రేపటి నుంచి మూడు రోజులపాటు అచ్చమ్మ తల్లి జాతర నిర్వహించడం జరుగుతుందని శనివారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గత 50 సంవత్సరాల నుంచి అచ్చమ్మ తల్లి జాతర నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.