జిల్లాలో 6 ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

KDP: లంకమల్ల అటవీ ప్రాంతంలో ప్రత్యేక దాడులు చేసి 6 ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం కడపలో వివరాలను వెల్లడించారు. స్మగ్లర్ల నుండి 1087.900 కిలోల బరువున్న 52 ఎర్రచందనం దుంగలు, 2 కార్లు, 1 ద్విచక వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.