MSME సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కమిషనర్

CTR: పుంగనూరు జరుగుతున్న MSME సర్వేను కమిషనర్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. మంగళవారం పట్టణంలోని నాగపాళ్యంలో క్షేత్రస్థాయిలో సచివాలయాల ఉద్యోగులు చేస్తున్న సర్వే పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఇలా అన్ని రకాల పరిశ్రమలను ఈ సర్వే పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.