సబ్ స్టేషన్ స్థలాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్
SRCL: వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్లకు సంబంధించి స్థలాలను ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. పెరుగుతున్న విద్యుత్ లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు నూతనంగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.