రోడ్డు కోసం కాలనీవాసుల ధర్నా

రోడ్డు కోసం కాలనీవాసుల ధర్నా

మేడ్చల్: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ముందు తమ కాలనీ రోడ్డును కబ్జా చేశారని ఆరోపిస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. గత 8 నెలలుగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు లేకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఆసుపత్రికి వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.