పరీక్షను వాయిదా వేయాలి: శ్రీకాంత్

పరీక్షను వాయిదా వేయాలి: శ్రీకాంత్

MDCL: ఈనెల 14న జరగనున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షను వాయిదా వేయాలని మేడ్చల్ బార్ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జంగా శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. అభ్యర్థులు HYDలో పరీక్ష రాయాల్సి ఉండటంతో దూర ప్రాంతాల వారు ప్రయాణ, వసతి, ఆహార సమస్యలతో ఇబ్బందులు పడతారన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని TSLPRB బోర్డు పరీక్ష తేదీని వాయిదా వేయాలని ఆయన కోరారు.